Weather : ఫిబ్రవరిలోనే మండే ఎండలు.. మరో నాలుగు నెలల పరిస్థితేంటి..?

Byline :  Kiran
Update: 2024-02-07 08:06 GMT

ఎండాకాలం మొదలైంది. ఫిబ్రవరి ప్రారంభంలోనే సూరీడు ప్రతాపం చూపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా నాలుగైదు డిగ్రీలు పెరగడంతో ఎండ సెగతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం నగరంలోని కూకట్ పల్లి, షేక్ పేటలో అత్యధికంగా 37.6°C, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 36.9°C బాలానగర్ లో 36.2°C ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఫిబ్రవరి నెలలో ఇప్పటి వరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 39.1డిగ్రీల కన్నా కేవలం 2 డిగ్రీలు తక్కువ కావడం విశేషం.

నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు సైతం పెరిగాయి. రెండు రోజుల క్రితం వరకు 16 నుంచి 17డిగ్రీల వరకు ఉండగా.. ఇప్పుడు 21.2గా నమోదైంది. ఇది సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువ అని హైదరాబాద్‌ వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది ఎండలు ఎక్కువే ఉంటాయనే అధికారులు అంటున్నారు. ఎల్ నినో కారణంగా మండే ఎండలు తప్పకపోవచ్చని చెబుతున్నారు. ఎల్ నినో కారణంగా ఎంత తీవ్రత పెరగడమే కాక.. వర్షపాతం, పంట దిగుబడిపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది.

టెంపరేచర్ పెరగడంతో విద్యుత్ వినియోగం సైతం పెరిగింది. పగలు రాత్రి తేడా లేకుండా ఇళ్లలో ఫ్యాన్లు తిరుగుతూనే ఉన్నాయి. ఏసీల వాడటం సైతం ఇప్పటి నుంచే ప్రారంభమైంది. పగటిపూట 3,100 మెగావాట్ల వరకు డిమాండ్‌ ఉండగా.. రాత్రి 9గంటలకు 2,697 మేర నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో రాత్రి పూట డిమాండ్ 2,287 మెగావాట్లుగా ఉంది.




 




 





Tags:    

Similar News