తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం రాత్రి వరకూ బలమైన గాలులు వీసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్, జనగాం, మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, భువనగిరి జిల్లాలకు అధికారులు ఎల్లో, గ్రీన్ అలర్ట్‌ను జారీ చేశారు. ఇక మంగళవారం హైదరాబాద్‌లోని నాంపల్లి, కోఠి, మలక్‌పేట్, ఖైరతాబాద్, నాంపల్లి, లక్డికపూల్, మెహిదీపట్నం, పంజాగుట్ట, సోమాజిగూడ, అమీర్‌పేట్, హిమాయత్‌నగర్‌లో తేలికపాటి వర్షం కురిసింది.
అటు ఏపీ ప్రజలను కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఏపీలోని దక్షిణ కోస్తా, ఉత్తరకోస్తాలోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కోస్తాలో గంటకు 40 నుంచి 50 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. జాలర్లు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ముఖ్యంగా కృష్ణా, బాపట్ల, పార్వతీపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అల్టర్ జారీ చేశారు.