Rains In Telangana: ఈశాన్య రుతుపవనాల ప్రభావం.. తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో మళ్లీ వాతావరణం మారనుంది. దీనికి సంబంధించి వాతావరణ శాఖ కీలక అప్ డేట్ చేసింది. గతకొన్ని రోజులుగా మధ్యాహ్నం పూట ఎండ, రాత్రి చలితో.. రాష్ట్ర ప్రజలు రెండు రకాల వాతావరణంతో ఇబ్బంది పడుతున్నారు. ఇక మిగిలిన వరుణుడు కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. మంగళవారం (అక్టోబర్ 31) తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో మన రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం అయి ఉంటుంది. కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా సూర్యపేట, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా రాష్ట్రంలో పగటిపూట ఎండలు మండిపోతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయి చలి వణికిస్తోంది.