తెలంగాణలో మొదలైన చలి తీవ్రత.. తగ్గుతోన్న ఉష్ణోగ్రతలు..

Byline :  Veerendra Prasad
Update: 2023-10-24 02:27 GMT

తెలంగాణ రాష్ట్రంలో చలిగాలులు మొదలయ్యాయి. గత మూడు రోజుల నుంచి ఊష్ణోగ్రతలు తగ్గడంతో కాస్త ఉపషమనం పొందుతున్నారు. అయితే నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పట్టడంతో రాష్ట్రం వైపు శీతల గాలులు వీయడం మొదలయ్యాయి. దీంతో చలి తీవ్రత నెమ్మదిగా ప్రారంభమైంది. ఇప్పటికే ఉత్తర తెలంగాణలోని పల్లెలు చలితో గజగజ వణకడం ప్రారంభించాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ కాశ్మీర్ గా పిలిచే ఆదిలాబాద్ లో ఇప్పుడే చలి తన పంజా విసరడం ప్రారంభించింది. ఆదివారం ఇక్కడ 1.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. అలాగే రామగుండం, మెదక్, హన్మకొండలోనూ పగటి పూట ఊష్ణోగ్రతలు తగ్గిపోయాయి.

అయితే హైదరాబాద్‌, భద్రాచలంలో మాత్రం సాధారణం కంటే కొంచెం ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో మాత్రం 33 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రుతు పవనాలు తిరుముఖం పట్టడంతో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే నెలలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈసారి తెలంగాణలో శీతాకాలం కాస్త ఆలస్యంగా వచ్చిందని చెప్పాలి. అక్టోబర్ నెల ప్రారంభమైన తర్వాత కూడా ఎండలు భగ్గుమన్నాయి. చాలా చోట్ల ఏకంగా 33 నుంచి 36 డిగ్రీల సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం.




Tags:    

Similar News