Weather Update: మరో అల్పపీడనం.. ఇక భారీ నుంచి అతి భారీ వర్షాలే!

Update: 2023-09-03 13:36 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎండలతో మగ్గిపోతున్న తెలంగాణకు మూడు రోజులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. ఈ ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో.. వాయువ్య, పశ్చిమ- మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.




 


సోమవారం (సెప్టెంబర్ 4) నుంచి బుధవారం (సెప్టెంబర్ 5) వరకు దీని ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయి. అంతేకాదు ఇవాళ (సెప్టెంబర్ 3) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్, మహబూబ్ నగర్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఇప్పటికే ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ హెచ్చరికలు జారీ చేసింది.




Tags:    

Similar News