ఓఎంఆర్ పద్దతిలోనే గ్రూప్ -2 ఎగ్జామ్.. ఆ రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవు..

Update: 2023-07-15 03:11 GMT

ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలను నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఎగ్జామినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు, స్కూళ్లకు ఆ రెండు రోజులు సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా విద్యాసంస్థలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.

ఆగస్టు 29, 30 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో రెండు సెషన్లలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈసారి కూడా పరీక్షను ఆప్టికల్‌ మార్క్‌ రికగ్నైజేషన్‌ (ఓఎంఆర్‌) పద్ధతిలోనే నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. గ్రూప్ 2 కింద మొత్తం 783 ఉద్యోగాలు ఉండగా వాటి కోసం 5,51,943 మం ది దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన చూస్తే సగటున ఒక్కో ఉద్యోగానికి 705 మంది పోటీపడుతున్నారు. పరీక్ష నిర్వహణ, కేంద్రాలు తదితర అంశాలపై టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు సభ్యుల భేటీలో చర్చించారు. గ్రూప్‌-2 పరీక్ష పూర్తైన తర్వాత గ్రూప్‌-1 మెయిన్స్‌, గ్రూప్‌-3 పరీక్షలు నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ సన్నాహాలు చేస్తోంది. గ్రూప్‌-1 మెయన్స్, గ్రూప్‌-3 పరీక్షలను అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో జరపాలని కమిషన్‌ నిర్ణయించినట్లు సమాచారం.

Tags:    

Similar News