UPSC: సివిల్స్‌ ప్రిలిమ్స్‌-2023 రిజల్ట్స్ వచ్చేశాయ్

Update: 2023-06-12 06:52 GMT

 సివిల్‌ సర్వీసెస్‌-2023 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్స్‌ మెయిన్స్‌కు మొత్తం 14,624 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు UPSC వెల్లడించింది. సెప్టెంబర్‌ 15 నుంచి సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. రిజల్ట్స్‌ లింక్‌: https://upsc.gov.in/ మొత్తం 1,105 సివిల్ సర్వీస్‌ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 1 నుంచి 21 వరకు యూపీఎస్సీ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ప్రిలిమ్స్‌ పరీక్షను మే 28న నిర్వహించారు.



ఈ పరీక్షలో పాసైన 14,624 మంది ఈ ఏడాది సెప్టెంబరు 15న జరిగే మెయిన్స్‌ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత సాధించారు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్ష కోసం ఇప్పుడు మళ్లీ డిటైల్డ్‌ అప్లికేషన్‌ ఫామ్‌ - 1 (DAF-I)లో దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్పీ తెలిపింది. ఇందుకు చివరి తేదీని కమిషన్‌ త్వరలోనే వెల్లడించనుంది.




Tags:    

Similar News