జూనియర్ మీద ప్రతాపం చూపించిన సీనియర్

ncc senior cadet beating junior ruthlessly in training. maharashtra;

Update: 2023-08-04 07:10 GMT

దొరికిందే సందు అని జూనియర్ల మీద తన ప్రతాపం చూపించాడు సీనియర్. ఎన్సీసీ ట్రైనింగ్ పేరుతో విచక్షణారహితంగా కొట్టాడు. ఏడుస్తూ గగ్గోలు పెడుతున్న పట్టించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మహారాష్ట్రలో థానేలోని జోషి బేడేకర్ కాలేజీలో జరిగింది ఈ ఘటన. తాను చెప్పినట్టు చేయడం లేదన్న కోపంతో అత్యంత దారుణంగా జూనియర్ విద్యార్ధులను కొట్టాడు ఓ సీనియర్. ట్రైనింగ్ పేరుతో చితకబాదాడు. ప్లాస్టిక్ పైపుతో ఎక్కడపడితే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు. ఇలా ఎంతకాలంగా చేస్తున్నాడో తెలియదు కానీ....ఎవరో ఒకరు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

బయట జోరుగా వర్షం కురుస్తోంది. అందులోనే, బురదలో చేతులు నేలమీద ఆన్చకుండా పుషప్ పొజిషన్ చేయమని చెప్పాడు సీనియర్. అలా చేయలేక ఓ విద్యార్ధి పడిపోతే చేసేంతవరకు కొట్టాడు. బాధతో అరుస్తున్న విడిచిపెట్టలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు తల్లిదండ్రులలో ఆందోళన రేపుతోంది. ఎంతకాలంగా ఇలా జరగుతుందో తెలియక వారు వర్రీ అవుతున్నారు. ఇంతలా హింసించడం ఏం ట్రైనింగ్ అంటూ పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది.

 

జోషి బెడేకర్ కాలేజ్ లో బండోద్కర్, బేడేకర్, పాలిటెక్నిక్ ఇలా మూడు విభాగాల విద్యార్థులకు ఉమ్మడి ఎన్‌సిసి శిక్షణ ఇస్తారు. దీనిలో విద్యార్థులకు సైన్యం, నేవీ శిక్షణకు ముందు పాఠాలు చెబుతారు. ఈ ఇలాంటి ట్రైనింగుల్లో శిక్షణ కఠినంగానే ఉంటుంది. తప్పుచేస్తే శిక్ష వేస్తారు. కానీ మరీ ఇంత అమానవీయంగా చేయరు. ఈ వీడియో కాలేజీ యాజమాన్యం వరకు వెళ్ళింది.ఇలాంటి ప్రవర్తనను సహించేది లేదని జోషి బేడేకర్ కాలేజీ ప్రిన్సిపాల్ సుచిత్రా నాయక్ తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా తక్షణమే కమిటీ వేస్తున్నామని చెప్పారు. ఇలాంటి సంఘటనలు జరిగిన విద్యార్థులు భయపడకుండా వచ్చి మమ్మల్ని కలవాలని, ఎన్‌సిసిని వదిలిపెట్టే ఆలోచన చేయవద్దని నాయక్ అన్నారు. గత 40 ఏళ్ళుగా తమ కాలేజీలో ఎన్సీసీ శిక్షణ ఇస్తున్నట్లుగా తెలిపారు. అధ్యాపకులు ఆప్సెంట్ అయిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ప్రిన్సిపల్ తెలిపారు.


Tags:    

Similar News