చిల్లర పోగు చేసి..కోటీశ్వరులయ్యారు..ఎలా అంటే?

Update: 2023-07-28 10:03 GMT

వారంతా మహిళా పారిశుద్ధ్య కార్మికులు. అత్యంత నిరుపేద కుటుంబాలకు చెందిన వారు. రోజంతా ప్రతి ఇళ్లు తిరిగి చెత్త సేకరిస్తుంటారు. వారు చేసిన పనికి గాను ప్రతి నెల 8వేల నుంచి 15వేలు మాత్రమే జీతం వస్తుంది. ఆ జీతంతోనే తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాగే ఉండిపోతే ఎలా అనుకున్నారు కాబోలు. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. తమ దగ్గర ఉన్న చిల్లరంతా పోగుచేసి ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. ఇంకేముంది ఆ మహిళలు జాక్ పాట్ కొట్టారు. లాటరీ తగలడంతో ఓవర్ నైటులో కోటీశ్వరులయ్యారు కేరళలోని 11 మంది మహిళా పారిశుద్ధ్య కార్మికులు. నడమంత్రపుసిరి సొంతం కావడంతో వారు ఈ నిజాన్ని నమ్మలేకపోతున్నారు.




 


కేరళ సర్కార్ 2023 మాన్‎సూన్ బంపర్ లాటరీ టికెట్ కొనడం కోసం ఈ 11 మంది మహిళలు తలా కొంచెం చందాలు వేసుకున్నారు. చందాలు వేసుకునే సమయంలో కొంత మంది దగ్గర కనీసం రూ. 25 కూడా లేవంటే వారి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లోనూ తమ దగ్గర ఎంత ఉంటే అంత పోగు చేసి ఎలాగోలా రూ. 250 పెట్టి బంపర్ లాటరీ టికెట్టు కొనుగోలుచేశారు. అతి కష్టం మీద కొన్న ఆ టికెటే వారికి ఇప్పుడు కాసుల వర్షం కురిపించింది. రూ.250 టికెట్టుకు రూ.10 కోట్ల నగదు బహుమతి లభించింది. ఈ విషయం తెలియగానే వారంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. దీంతో తమ అప్పులు తీరుస్తామని , మిగిలిన దానితో తమ పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పిస్తామని మహిళలు చెబుతున్నారు.




 


ఈ 11 మంది మహిళలు గత నాలుగేళ్లుగా ఈ బంపర్ లాటరీ టికెట్ ను కొనుగోలు చేస్తున్నారు. ప్రతి ఏటా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఓ సంవత్సం ఓనమ్ వేళ లాటరీలో రూ. 1000 బహుమానం పొందారు. ఆ తరువాత ఈ సారి మాత్రం బంపర్ లాటరీ తగలడంతో వీరి జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. లాటరీలో కోట్లు వచ్చినా ఇన్నాళ్లు తామకు ఉపాధి కల్పించిన ఉద్యోగాన్ని మాత్ం వీడమని మహిళలు చెబుతున్నారు. 

  




Tags:    

Similar News