ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు.. రైళ్లు, విమానాల రాకపోకలపై ప్రభావం

Byline :  Kiran
Update: 2023-12-27 07:07 GMT

దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కప్పేసింది. బారెడు పొద్దెక్కినా సూర్యుడు కనిపించడం లేదు. దట్టమైన పొగ మంచు కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగ మంచు దట్టంగా అలుముకోవడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చలి తీవ్రత భారీగా పెరగడంతో వాతావరణ శాఖ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఢిల్లీకి రావాల్సిన 25 ట్రైన్లు ఆలస్యంగా నడుస్తున్నాయని నార్తన్ రైల్వే ప్రకటించింది. ఇక ఇందిరా గాంధీ విమానాశ్రయాన్ని సైతం దట్టమైన పొగ మంచు కప్పేయడంతో దాదాపు 110 ఫైట్ల రాకపోకలపై దాని ప్రభావం పడింది. కొన్ని విమానాలు ఆలస్యం కాగా.. మరికొన్నింటి దారి మళ్లించారు.

ఉత్తర్ ప్రదేశ్ లోనూ ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ఆగ్రా - లక్నో ఎక్స్ప్రెస్ వేపై పలు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదాల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి.

Tags:    

Similar News