రాజస్థాన్లో దారుణం.. మేకలు కాసేందుకు వెళ్లి కాలి బూడిదైంది
రాజస్థాన్లో దారుణం జరిగింది. 12 ఏండ్ల బాలికపై కామాందులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండ రాక్షసంగా వ్యవహరించారు. బాలికను ఇటుకబట్టీలో సజీవ దహనం చేశారు. కోట్రీ జిల్లాలలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది.
మేకలు మేపేందుకు వెళ్లి
బిల్వారా జిల్లా కోట్రీ పట్టణానికి చెందిన బాలిక బుధవారం మధ్యాహ్నం తల్లితో కలిసి మేకలను మేపేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లింది. అయితే కాసేపటికి బాలిక కనిపించకుండా పోయింది. రాత్రి వరకు వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇటుక బట్టీలో
గ్రామస్థులు బాలిక ఆచూకీ కోసం వెతుకుతుండగా ఓ ఇటుక బట్టీ వద్ద గాజులు, చెప్పులు కనిపించాయి. దీంతో స్థానికులు బాలికపై సామూహిక అత్యాచారం చేసి ఇటుక బట్టీలో పడేశారని ఆరోపించారు. బట్టీలో మరికొన్ని మృతదేహాల ఆవశేషాలు కూడా ఉండొచ్చని ఆరోపించారు. దీంతో పోలీసులు డాగ్ స్క్వాడ్ తో పాటు ఫోరెన్సిక్ బృందాన్ని ఘటనాస్థలానికి రప్పించారు. ముగ్గురు అనిమానితులను అదుపులోకి తీసుకున్నారు.
గ్రామస్థుల నిరసన
12 ఏండ్ల బాలికపై హత్యాచార ఘఠనపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. తమ ఫిర్యాదుపై పోలీసులు వెంటనే స్పందించలేదని, ఐడీ, జనన ధ్రువీకరణ పత్రం అడిగారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసింది.