మోడీ ఎన్నికల ప్రచారానికి 150 సభలు..షెడ్యూల్ ఖరారు

Byline :  Shabarish
Update: 2024-03-08 15:55 GMT

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఇందుకోసం ఆయన షెడ్యూల్ ఖారరైంది. మొత్తం 150 సభలు, రోడ్ షోలలో మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈసారి దక్షిణాదిన బీజేపీ ఫోకస్ పెట్టింది. అందుకోసమే బీజేపీ ముఖ్య నేతలంతా సభలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. మార్చి 25వ తేదిన హోలీ తర్వాత దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎన్నికలకు సంబంధించి రోజుకు 35 నుంచి 40 సభలు, సమావేశాలను బీజేపీ నిర్వహించనుంది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో 303 స్థానాల్లో బీజేపీ గెలిచింది. అందులో కూడా 224 సీట్లలో బీజేపీ 50 శాతానికి పైగా ఓట్లను సాధించింది. అయితే ఈసారి ఆయా స్థానాల్లో ఓటింగ్ శాతాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. కొత్తగా గెలవబోయే స్థానాల్లోనూ 50 శాతం ఓట్లు పొందాలని బీజేపీ భావిస్తోంది. అందుకోసం సభలు, సమావేశాలు, రోడ్ షోలు, కార్యకర్తలతో మీటింగులను నిర్వహించనుంది.

బీజేపీ అధిష్టానం అసోంలో రెండు సభలను నిర్వహించనుంది. యూపీలో 15 కంటే ఎక్కువ సభలు, రోడ్ షోలు ఉంటాయి. అలాగే యూపీలో కాన్పూర్, లఖ్‌నవూ, గోరఖ్‌పూర్, వారణాసి, ఝాన్సీ, ప్రయాగ్‌రాజ్, మొరాదాబాద్, మీరట్, బరేలీ, ఆగ్రాలలో ప్రధాని మోడీ సభలు ఉంటాయి. నామినేషన్ రోజు కూడా వారణాసిలో ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించేలా బీజేపీ ఏర్పాట్లు చేసింది. ప్రధాని మోడీతో పాటు హోం మంత్రి అమిత్ షా, సీఎం యోగి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొననున్నారు.


Tags:    

Similar News