Swiggy: స్విగ్గీలో వెల్లువెత్తిన కండోమ్ ఆర్డర్లు.. గంటకు ఎన్నివేలంటే..?
ప్రపంచవ్యాప్తంగా న్యూఇయర్ సంబరాలు అంబరాన్ని అంటాయి. భారత్ లోనూ యువత కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా మద్యం విక్రయాలు జోరుగా జరగగా.. చికెట్, మటన్ అమ్మకాల్లో కూడా రికార్డులు నమోదయ్యాయి. ఈ లిస్ట్ లో కండోమ్ ఆర్డర్స్ కూడా రికార్డ్ మోత మోగించాయి. ఆదివారం (డిసెంబర్ 31) ఏడాది చివరి రోజు సందర్భంగా గంటకు 1,722 కండోమ్ ఆర్డర్స్ వచ్చాయని ప్రముఖ డెలివరీ సంస్థ స్విగ్గీ ట్వీట్ చేసింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి 2023లో ఏకంగా 9,940 కండోమ్ ఆర్డర్లు చేసినట్లు జొమాటో (బ్లింకిట్) డెలివరీ సంస్థ తెలిపింది.
దీనిపై నెటిజన్స్ సరదా కామెంట్స్ చేస్తున్నారు. అన్ని వేల కండోమ్ ఆర్డర్ చేశాడంటే.. అది కచ్చితంగా సేవ్ ఇన్వెస్ట్ మెంట్ అని అంటున్నారు. దీనిపై స్పందించిన బ్లింకిట్ సీఈఓ అల్బిందర్ ధిండా.. భారత ప్రజలు 2023లో బ్లింకిట్ ను ఆధరించారని, గణనీయంగా ఆర్డర్లు పెరిగాయని చెప్పుకొచ్చారు. ఇక ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో విజయవంతంగా కొత్త ఏడాదిని జరుపుకుంది. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి ఆర్డర్లు మరింత పెరిగాయని తెలిపింది.