2024 ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయ్ : రాహుల్ గాంధీ

Update: 2023-06-02 09:58 GMT

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. ఎన్నికలు సహా పలు అంశాలపై తనదైన శైలిలో స్పందించారు. 2024 ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయని చెప్పారు. రాబోయే రెండేళ్ళలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు.

‘‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించి.. బీజేపీ గద్దె దించింది. త్వరలో జరగబోయే మూడు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలను రిపీట్ అవుతాయి. కాంగ్రెస్ మరింత శక్తివంతంగా తయారవుతుంది. ఎన్నికల ఫలితాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి’’ అని రాహుల్ గాంధీ అన్నారు. అదేవిధంగా ప్రతిపక్షాల ఐక్యతపై కూడా ఆయన స్పందించారు.

‘‘భారత్‌లో ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయి. విపక్ష పార్టీలతో కాంగ్రెస్‌ విస్తృతంగా సమావేశాలు జరుపుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాయి. ఒకే భావజాలం కలిగిన పార్టీలన్నీ జూన్ 12న పాట్నాలో సమావేశం అవుతున్నాయి. ఈ సమావేశానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ అధ్యక్షత వహిస్తారు’’ అని రాహుల్ అన్నారు. ఈ సందర్భంగా మీడియా స్వేచ్ఛపై కూడా రాహుల్ పలు కామెంట్స్ చేశారు. ‘‘ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా స్వేచ్ఛ అత్యంత కీలకమైనది. విమర్శలను హుందాగా స్వీకరించాలి. కానీ, భారత్‌లో ఈ స్వేచ్ఛను బలహీనపరుస్తున్నారు. మీడియాపై నిర్బంధం ఉంది’’ అంటూ బీజేపీపై మండిపడ్డారు.


Tags:    

Similar News