సిక్కింలో వరదలు... 2,400 మంది పర్యాటకులకు కష్టాలు

Update: 2023-06-17 11:42 GMT

సిక్కింను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మూడు రోజులుగా కుంభ వృష్టి కురుస్తోంది. దీంతో జనజీవనం అస్తవ్యస్థమైంది. ఆకస్మిక వరదల కారణంగా రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలుచోట్ల రోడ్లు కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది. 345 కార్లు, 11 బైకులు బురుదలో కూరుకుపోయాయి. మరోవైపు పశ్చిమ సిక్కింలోని రింబు ప్రాంతంలో 90 ఏండ్ల వృద్ధుడు ఒకరు వరద నీటిలో కొట్టుకు పోయాడు.

వరదలు కారణంగా వేల మంది పర్యాటకులు అష్టకష్టాలు పడుతున్నారు. సుమారు 2400 మంది ఉత్తర సిక్కిం ప్రాంతంలో పర్యాటకులు చిక్కుపోయారు. దీంతో వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. జిల్లా విపత్తు నిర్వహణ సిబ్బంది, సిక్కిం పోలీసులు, బీఆర్‌వో, ఐటీబీపీ, ఆర్మీ బృందాలు కలిసి సహాయక చర్యలు మొదలుపెట్టాయి. తాత్కాలికంగా వంతెనలను ఏర్పాటు చేసి పర్యాటకులను తరలిస్తున్నారు. మొత్తం 2,464 మందిని తరలించేందుకు 19 బస్సులు, 70 చిన్న వాహనాలను ఏర్పాటు చేశారు. క్షేమంగా బయటపడిన పర్యాటకులు భద్రతాబలగాలకి సెల్యూట్ చేశారు.

Tags:    

Similar News