అమర్‌నాథ్‌ యాత్ర.. మంచు లింగం దర్శనానికి వెళ్లిన రెండో బ్యాచ్

Update: 2023-07-01 02:54 GMT

అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమైంది. శుక్రవారం ప్రారంభమైన ఈ యాత్రకు.. ఇవాళ రెండో బ్యాచ్ బయలుదేరింది. జమ్ము-కశ్మీర్‌ భగవతి నగర్‌ క్యాంప్‌ నుంచి ఫస్ట్ బ్యాచ్ యాత్రను లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల భద్రత నడుమ 3,400 మందికి పైగా యాత్రికులు మంచులింగం దర్శనానికి బయలుదేరారు.

ఇక ఇవాళ రెండో బ్యాచ్ స్వామి దర్శనానికి బయలుదేరింది. జమ్మూ క్యాంప్ నుంచి 188 బస్సుల్లో 4400 మంది శివలింగం దర్శనానికి వెళ్లారు. దీంతో అమర్‌నాథ్‌ యాత్రికుల సంఖ్య 7800కు చేరింది. హిమాలయాల్లోని మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఇప్పటికే 3.5 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఈ యాత్ర అనంతనాగ్‌ జిల్లాలోని 48 కి.మీ. పొడవైన నునవాన్‌-పహల్గామ్‌ మార్గంతో పాటు గందేర్బల్‌ జిల్లాలోని 14 కి.మీ పొడవైన బల్తల్‌ మార్గంలో 62 రోజుల పాటు కొనసాగుతుంది. ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్ర కోసం జమ్మూ కశ్మీర్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు.

అమర్‌నాథ్‌ యాత్రికుల భద్రతన సీఆర్పీఎఫ్కు బదులుగా.. ఐటీబీపీ పర్యవేక్షించనుంది. గతేడాది జులై 8న అమర్‌నాథ్‌లో మెరుపు వేగంతో వరదలు సంభవించినప్పుడు ఐటీబీపీ జవాన్లు అత్యంత సమర్థవంతంగా రెస్క్యూ చేపట్టారు. చాలా మంది భక్తులను కాపాడారని, అందువల్ల ఈసారి భద్రత బాధ్యతను వారికే అప్పగించ సలహా ఇచ్చినట్లు సమాచారం. 

Tags:    

Similar News