శనివారం (ఆగస్టు 5) మధ్యాహ్నం 2:39 గంటల సమయంలో బంగాళాఖాతంలో వచ్చిన భూ ప్రకంపనలు తీవ్ర అలజడిని సృష్టించాయి. నేషనల్ ఫర్ సిస్మాలజీ అందించిన వివరాల ప్రకారం భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.4గా నమోదయింది. సముద్రం మధ్యలో 10 కి.మీ. లోపల ఈ భూకంపం వచ్చింది. దీనివల్ల ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.
ప్రస్తుతం అలల తీవ్రత పరిశీలిస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ సునామీ వల్ల ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు జమ్ము కశ్మీర్ లోని పర్యటక కేంద్రం గుల్ మార్గ్ లో కూడా భూకంపం వచ్చింది. శనివారం (ఆగస్టు 5) ఉదయం 8:36 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.2గా నమోదయింది.