'చౌకబారు రాజకీయాలు... ' జాతీయ అవార్డుల ప్రకటనపై సీఎం సీరియస్

Update: 2023-08-25 04:31 GMT

చౌకబారు రాజకీయాల కోసం జాతీయ అవార్డుల గౌరవాన్ని దెబ్బతీయరాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. కేంద్ర ప్రభుత్వం నిన్న 69వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించిన నేపథ్యంలో సీఎం స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గురువారం ప్రకటించిన ఆవార్డులకు మొత్తం ఏడు భాషలు పోటీ పడగా.. తెలుగు సినిమాలకు 10 అవార్డులు వచ్చాయి. ఈ అవార్డుల ప్రకటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసహనం వ్యక్తం చేశారు.




 


ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పార్టీలకతీతంగా సినీ విమర్శకులు వివాదాస్పదంగా బహిష్కరించిన చిత్రానికి జాతీయ సమగ్రతపై ఉత్తమ చిత్రంగా నర్గీస్ దత్ అవార్డును ప్రకటించడం దిగ్భ్రాంతికరం’’ అని ది కాశ్మీర్ ఫైల్స్ పేరు ప్రస్తావించకుండానే ఆయన మండిపడ్డారు. సాహిత్య రచనలు, సినిమాలు రాజకీయ రహితంగా ఉండాలని... ఎందుకంటే ఇవి మాత్రమే భావితరాలకు ఉన్నతంగా ఉంచుతుందని అభిప్రాయపడ్డారు. చౌకబారు రాజకీయాల కోసం జాతీయ అవార్డుల పరువు పోకూడదన్నారు.

జాతీయ అవార్డులు రాజకీయాలను ప్రభావితం చేయకూడదని అన్నారు. ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న చిత్రాలను ఎలా పరిగణలోకి తీసుకుంటారని సీరియస్ అయ్యారు. ఎన్నికల వేళ కావాలనే సినిమా అవార్డులను కేంద్ర ప్రభుత్వం రాజకీయాలకు వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గురువారం ఢిల్లీలో 69వ జాతీయ అవార్డులు -2021 ప్రకటించింది. ఇందులో జాతీయ సమగ్రతా చిత్రంగా ది కశ్మీర్ ఫైల్స్ ఎంపిక అయింది.వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన చిత్రం అవార్డును గెలుచుకోవడంపై రాష్ట్రంలోని అధికార డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సోషల్ మీడియా పోస్ట్‌లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆయా విభాగాల్లో అవార్డులు గెలుచుకున్న గాయని శ్రేయా ఘోషల్, సంగీత విద్వాంసుడు శ్రీకాంత్ దేవా మరియు 'కడైసి వివాహాయి' మరియు 'సిర్పిగాలిన్ సిర్పంగల్' బృందాలను సీఎం స్టాలిన్ అభినందించారు.




Tags:    

Similar News