బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఏడుగురు మృతి

Update: 2023-08-27 07:21 GMT

పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. వివరాలు.. నార్త్ 24 పరగణాల జిల్లాలోని దత్తపుకుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీల్‌గంజ్‌ ప్రాంతంలో ఉన్న మోష్‌పోల్‌లోని బాణసంచా ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగింది. ఆదివారం తెల్లవారుజూమున జరిగిన ఈ పేలుడు ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అక్రమ బాణసంచా తయారీ కేంద్రానికి ఆనుకుని ఉన్న పలు ఇళ్లు దెబ్బతిన్నాయి.

ఈ ప్రమాదంలో మృతదేహాల శరీర భాగాలు పక్కనున్న ఇళ్లపై, చెట్లపై పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షత గాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News