MODI :మోదీ సొంతూళ్లో 2,800ఏళ్ల నాటి సిటీ.. వీడియో వైరల్

Byline :  Bharath
Update: 2024-01-17 02:34 GMT

భారతదేశ నాగరికత ఎన్నో ఏళ్లనాటిదని తెలిసిందే. కానీ కాలక్రమేణా అది కాల గర్భంలో కలిసిపోయింది. అయితే అప్పుడుప్పుడు పురావస్తుశాఖ తవ్వకాల్లో బయటపడుతుండటం చూస్తుంటాం. తాజాగా అదే జరిగింది. 2,800 ఏళ్ల (క్రీ.పూ.800) నాటి సిటీ తాజాగా బయటపడింది. అది ఎక్కడో కాదు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సొంతూరు వాద్ నగర్ లో. వాద్‌నగర్‌లో పురావస్తుశాఖ(ఏఎస్ఐ) జరిపిన తవ్వకాల్లో పురాతన పట్టణం బయటపడింది. ఇక్కడ లభించిన ఆధారాల ప్రకారం 2,800ఏళ్ల (క్రీ.పూ.800) అప్పటి నుంచే వాద్ నగర్ లో మానవ మనుగడ ఉండేదని జువాలజిస్టులు, జియోఫిజిక్స్ అధికారులు అంటున్నారు. ఈ విషయంపై మాట్లాడిన ఐఐటీ ఖరగ్ పూర్ లోని జియోఫిజిక్స్ ప్రొఫెసర్ అనింద్య సర్కార్.. ఈ తవ్వకాలపై జరిపిన లోతైన అధ్యయనంలో 3,500 ఏళ్లలో వివిధ రాజ్యాల ఆవిర్భావం, వాటి పతనంత గురించి తెలుసుకున్నట్లు తెలిపారు.

అంతేకాకుండా మధ్య ఆసియా యోధులు భారత్ పై జరిపిన వరుస దండయాత్రలు, వాతావరణంలో తీవ్ర మార్పులతో ఏర్పడ్డ కరువు పరిస్థితుల గురించి తెలుస్తుందని ఆయన చెప్పారు. వాద్ నగర్ లో దాదాపు ఐదేళ్లుగా ఏఎస్ఐ బృదం పరిశోధనలు చేపడుతుంది. గతంలో అత్యంత పురాతన బౌద్ధ ఆలయం కూడా తవ్వకాల్లో బయటపడింది. ప్రస్తు బయటపడ్డ ఈ సిటీ.. దేశంలోనే అత్యంత పురాతనమైనదిగా అధికారులు భావిస్తున్నారు. తవ్వకాల్లో మొత్తం ఏడు సాంస్కృతిక పొరలు బయటపడినట్లు వారు వివరించారు. కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.





Tags:    

Similar News