దేశరాజధాని ఢిల్లీలోని ఓ బోరుబావిలో ఆడుకుంటూ వెళ్లి చిన్నారి పడిపోయింది. ఈ ఘటన ఢిల్లీ వాటర్ బోర్డు ప్లాంట్‌లో చోటుచేసుకుంది. కేశోపూర్ మండి సమీపంలోని ఢిల్లీ వాటర్ బోర్డు ప్లాంట్‌లోని 40 అడుగుల లోతైన బోరుబావిలో ఓ చిన్నారి ప్రమాదవశాత్తూ పడిపోయింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది , ఎన్‌డిఆర్‌ఎఫ్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బోరుబావిలో పడిన చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్పారు. ఆ బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వి, చిన్నారిని సురక్షితంగా బయటకు తీసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.