ఢిల్లీ ఎయిమ్స్లో అగ్ని ప్రమాదం.. ఎండోస్కోపీ గదిలో చెలరేగిన మంటలు

Update: 2023-08-07 09:25 GMT

దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌.. ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పాత ఓపీడీ భవనంలోని రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఎండోస్కోపీ రూంలో ఒక్కసారిగా మంటలు రావడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. కింది అంతస్థులో ఎమర్జెన్సీ వార్డు ఉండటంతో రోగులు, హాస్పిటల్ సిబ్బంది బయటకు పరుగులు తీశారు.

అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు, ఫైరింజన్ సిబ్బంది వెంటనే ఎయిమ్స్ కు చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. ఎండోస్కోపి గదిలో ఉన్న రోగులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఆరు ఫైరింజన్లతో మంటలు అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News