పులి రాజును కాపాడిన అగ్గిరాజు.. వీడియో వైరల్

Update: 2023-06-23 14:16 GMT

అడవిలో ఉండే వన్యమృగాలు జనసంచారంలోకి వచ్చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కువగా పులులు, చిరుతలు సంచారం ప్రజలను భయపెడుతోంది. కొన్ని పరిస్థితిలో అవి కూడా ప్రమాదాల్లో చిక్కుకుంటున్నాయి. తాజాగా ఓ చిరుతకు అనుకోని కష్టం వచ్చింది.

క‌ర్నాట‌క‌లోని ఓ ప్రాంతంలో అడవి పక్కనే ఉండే ఓ గ్రామంలోకి వచ్చిన చిరుత బావిలో పడిపోయింది. పైకి రాలేక దాంట్లోనే ఉండిపోయింది. స్థానికులు దానిని బయటకు తీసేందుకు అధికారులతో కలిసి శ్రమించారు. భయపడకుండా ఓ ఉపాయం ఆలోచించి చిరుతను క్షేమంగా బయటకు తీశారు. చిరుతను బయటకు రప్పించేందుకు వారు ఓ నిచ్చెన, కాగ‌డాను ఉపయోగించారు.

ముందుగా బావిలో ఓ నిచ్చెన ఏర్పాటు చేశారు. అనంతరం అగ్గితో ఉన్న కాగాడాను బావిలోకి పంపి చిరుతని భయపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో అగ్గి భయంతో కంగారు పడిని చిరుత..ఆ నిచ్చెన ఎక్కి బయటకు వచ్చేసింది. వెంటనే వెనక్కకు తిరిగి చూడకుండా పక్కనే ఉన్న అడవిలోకి పరుగులు తీసింది.




 


చిరుత క్షేమంగా బయటపడడంతో గ్రామస్తులు, అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. సోష‌ల్ మీడియాలో స‌హ‌నా సింగ్ ఈ క్లిప్‌ను షేర్ వైరల్ గా మారింది. చిరుత‌ను కాపాడిన గ్రామ‌స్తుల‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే మరికొందరు మాత్రం నిప్పుతో పులిని బెదిరించడం తగదని..గాయపడే అవకాశం ఉందని హితబోధ చేస్తున్నారు. కింద ఉన్న వీడియోపై మీరు ఓ లుక్కేయండి.


 








Tags:    

Similar News