విప‌క్ష ఇండియా కూట‌మికి వరుస షాక్‌లు

Update: 2024-02-09 09:10 GMT

ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సీట్లు సర్ధుబాటుపై స్పష్టత రాకపోవడంతో పంజాబ్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన ఆప్. ఇప్పుడు అస్సాంలోనూ 3 స్థానాలను ప్రకటించింది. అయితే ఈ మూడు స్థానాలు కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉన్న స్థానాలు ..హస్తం పార్టీ నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతోనే ప్రకటించినట్లు ఆప్ తెలిపింది.. 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో యూపీలో బీజేపీతో ఆర్ఎల్‌డీ పొత్తు ఖ‌రారైంది. సీట్ల స‌ర్దుబాటు ఒప్పందం ప్ర‌కారం ఆర్ఎల్‌డీ యూపీలో రెండు లోక్‌స‌భ స్ధానాల్లో పోటీ చేస్తుంది.

బాఘ్ప‌ట్‌, బిజ్నూర్ స్ధానాల్లో ఆర్ఎల్‌డీ పోటీ చేయ‌నుండ‌గా మ‌రో రాజ్య‌స‌భ సీటు కేటాయిస్తామ‌ని కూడా జ‌యంత్ చౌధురి పార్టీకి బీజేపీ హామీ ఇచ్చింది.మ‌రో రెండు మూడు రోజుల్లో ఆర్ఎల్‌డీ, బీజేపీ పొత్తుకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. యూపీలో ఆర్ఎల్‌డీకి ప‌శ్చిమ యూపీలో గ‌ట్టి ప‌ట్టుంది. ఈ ప్రాంతంలో ప్రాబ‌ల్యం క‌లిగిన జాట్ ఓటుబ్యాంక్‌పై క‌న్నేసిన బీజేపీ ఆర్ఎల్‌డీతో పొత్తుకు మొగ్గుచూపింది.2019 లోక్‌స‌భ ఎన్నికల్లో యూపీలో 16 స్ధానాల‌ను బీజేపీ కోల్పోగా ఇందులో 7 స్ధానాలు ప‌శ్చిమ యూపీలోనివే కావ‌డం గ‌మ‌నార్హం. మొర‌దాబాద్ డివిజ‌న్‌లో 6 స్ధానాల్లోనూ కాషాయ పార్టీ ప‌రాజ‌యం పాలైంది. యూపీలో ఇండియా విప‌క్ష కూటమిలో సీట్ల స‌ర్ధుబాటులో విభేదాలు త‌లెత్త‌డంతో ఆర్ఎల్‌డీ ఎన్డీయేకు చేరువైంది.




Tags:    

Similar News