ఆ గ్రామంలో భారత రాజ్యాంగం వర్తించదు.. ఇండియాలో ఎక్కడుందంటే
భారతదేశం అంతటా గణతంత్ర దినోత్సవ వేడుకగా సాగాయి. అయితే ఓ గ్రామంలో మాత్రం ఆ వేడుకలు జరగలేదు. అందుకు ఓ కారణం ఉంది. భారత రాజ్యాంగం ఆ గ్రామానికి వర్తించదు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఉన్నటువంటి మలానా గ్రామంలో భారత రాజ్యాంగం, చట్టాలేవీ వర్తించవు. ఈ గ్రామానికి సొంత రాజ్యాంగం, పార్లమెంట్ భవణాలు ఉన్నాయి. ఆ గ్రామ ప్రజలంతా తమ సొంత నియమాలను మాత్రమే పాటిస్తారు. గ్రామ నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం సొంత శిక్షలు విధిస్తారు. ఈ మలానా గ్రామం హిమాచల్‌ప్రదేశ్ లోని కులు జిల్లాలో ఉంది.
మలానా గ్రామం ఓ మారుమూల ప్రాంతం. అక్కడికి చేరుకోవాలంటే కులు నుంచి 45 కిలోమీటర్ల వరకూ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ మలానా గ్రామానికి పర్యాటకులు కూడా బాగానే వెళ్తుంటారు. అయితే పర్యాటకులకు కూడా ఆ గ్రామం పలు నియమాలను పెట్టింది. బయటి వ్యక్తులు అక్కడికి వెళ్తే గ్రామంలో అస్సలు ఉండకూడదు. అలాగే గ్రామం బయట వారు గుడారాలు ఏర్పాటు చేసుకుని ఉండాలి. గ్రామానికి సంబంధించిన సరిహద్దు గోడలను పర్యాటకులు తాకడం నిషేధంగా ఉంది.
ఈ గ్రామం భారతదేశంలో భాగమే అయినప్పటికీ అది సొంత న్యాయవ్యవస్థను కలిగి ఉంది. గ్రామానికి సొంత పార్లమెంట్ ఉండగా అందులో రెండు సభలు ఉంటాయి. ఎగువ సభను జ్యోతంగ్ అని అంటారు. ఇందులో 11 మంది సభ్యులుగా ఉంటారు. దిగువ సభను కనిష్తాంగ్ అని అంటారు. ఇక్కడ ఎగువ సభలో 8 మందిని గ్రామస్తులు ఓటు ద్వారా ఎన్నుకుంటే మిగిలిన నలుగురు శాశ్వత సభ్యులుగా ఉంటారు. ప్రతి ఇంటి నుంచి ఒకడు ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. ఇప్పటికీ ఈ గ్రామంలో వివాదాలు తలెత్తితే తామే పరిష్కరించుకుంటారు. భారత చట్టాలను పాటించరు.