రాజ్యసభ నుంచి ఆప్ ఎంజీ సంజయ్ సింగ్ సస్పెండ్

Update: 2023-07-24 08:29 GMT

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. వర్షాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని చైర్మన్ జగదీప్ ధన్కడ్ ప్రకటించారు. మణిపూర్ ఘటనపై విపక్షాలు రాజ్యసభలో ఆందోళనకు దిగాయి. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సైతం ఈ అంశంపై ప్రధాని మోడీ వివరణ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. రాజ్యసభ ఛైర్మన్ పలుమార్లు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా సంజయ్ సింగ్ వెనక్కి తగ్గలేదు. దీంతో రాజ్యసభాపక్ష నేత పీయూష్ గోయెల్ ఆయనను సస్పెండ్ చేయాలంటూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో సంజయ్ సింగ్ ను వర్షాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు.

సంజయ్ సింగ్ సస్పెన్షన్ ను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇది దురదృష్టకరమని అభిప్రాయపడింది. నిజాలు మాట్లాడినందునే సస్పెండ్ చేశారని విమర్శించింది. అయినా తాము వెనక్కి తగ్గమని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే సంజయ్ సింగ్ పై సస్పెన్షన్ వేటు తొలగించాలని కోరుతూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్ ను కలిశారు.


Tags:    

Similar News