జైలు నుంచి తప్పించుకునేందుకు గోడ దూకిన ఖైదీ.. తర్వాత ఏమైందంటే.. (వీడియో)

Byline :  Kiran
Update: 2023-08-28 12:56 GMT

బెంగళూరు : అతనో అండర్ ట్రయల్ ఖైదీ. రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. రిమాండ్ లో ఉన్న అతను జైలు నుంచి తప్పించుకునేందుకు పెద్ద స్కెచ్ వేశాడు. ప్రాణాలకు తెగించి మరీ జైలు నుంచి పారిపోయాడు. అయితే 24 గంటలు గడవక ముందే మళ్లీ పోలీసులకు చిక్కాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

కర్నాటకకు చెందిన వసంత్ అనే 23 ఏండ్ల యువకుడు అమ్మాయిపై అత్యాచారం చేశాడు. ఆ కేసులో అతన్ని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్కు పంపింది. దీంతో పోలీసులు నిందితున్ని దేవనగరే సబ్ జైలుకు పంపారు. అయితే జైలు నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్న వసంత్ అందుకోసం పక్కా స్కెచ్ వేశాడు. అదును చూసుకుని శుక్రవారం ప్లాబ్ అమలు చేశాడు.




 


జైలు నుంచి బయట పడేందుకు 40 ఫీట్ల గోడ దాటాల్సి ఉంది. ఎలాగోలా కష్టపడి ఆ గోడ ఎక్కిన వసంత్ బయటకు దూకేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి దర్జాగా వెళ్లిపోయాడు. ఇదంతా సబ్ జైలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. సోషల్ మీడియాలో ఆ దృశ్యాలు వైరల్గా మారాయి. ఈ ఘటన అంతా సబ్ జైలు సీసీటీవీలో రికార్డైంది. ఇదిలా ఉంటే అంత కష్టం జైలు గోడ దూకి పారిపోయిన నిందితున్ని 24 గంటలు గడవకముందే హవేరీ ప్రాంతంలో పోలీసులు పట్టుకోవడం విశేషం.




Tags:    

Similar News