Gautam Adani:సుప్రీం తీర్పుతో ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్‌గా అదానీ

Byline :  Veerendra Prasad
Update: 2024-01-05 06:32 GMT

అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్‌పర్సన్ గౌతం అదానీ మరోమారు భారతదేశంలోనే అత్యంత సంపన్నుడిగా రికార్డుల్లోకి ఎక్కారు. సుప్రీం కోర్టు తీర్పుతో గౌతమ్​ అదానీ సంపద అమాంతం పెరిగింది. ప్రస్తుతం దేశంలోనే అత్యంత సంపన్నుడు అయిన రిలయన్స్​ చైర్మన్​ ముకేశ్​ అంబానీని ఆయన మించిపోయారు. అదానీ గ్రూపునకు అనుకూలంగా తీర్పు రావడంతో అహ్మదాబాద్‌‌‌‌కు చెందిన ఈ సంస్థ కంపెనీల షేర్లు బుధవారం 12 శాతం వరకు పెరిగాయి. దీంతో మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15 లక్షల కోట్లకు చేరింది. ఈ లాభాల ఫలితంగా, గౌతమ్ అదానీ కుటుంబం అంబానీని అధిగమించింది. భారతదేశంలో అత్యంత సంపన్న ప్రమోటర్ గుర్తింపును తిరిగి సంపాదించుకుంది. బుధవారం గౌతమ్ అదానీ కుటుంబం నికర విలువ రూ.9.37 లక్షల కోట్లకు పెరిగింది. అంతకు ముందు రోజు దీని విలువ రూ.8.98 లక్షల కోట్లు.

అదానీ గ్రూప్‌పై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (SEBI) చేస్తున్న దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసు దర్యాప్తును సెబీ లేదా సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మిగిలిన రెండు కేసుల్లో దర్యాప్తు ముగించడానికి అత్యున్నత న్యాయస్థానం సెబీకి మరో 3 నెలల గడువు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు అదానీకి అనుకూలంగా ఉండడంతో, ఆ గ్రూప్‌లోని 10 లిస్టెడ్‌ కంపెనీల స్టాక్స్‌ బుధవారం 12 శాతం వరకు పెరిగాయి, అన్నీ కలిసి ఒక్కరోజులో దాదాపు రూ.64,500 కోట్లకు పైగా లాభపడ్డాయి. దీంతో, అదానీ గ్రూప్‌ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 15.11 లక్షల కోట్లకు పైగా పెరిగింది.

2023, జనవరిలో అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ నివేదిక.. గౌతమ్ అదానీ సంస్థలపై తీవ్ర ఆరోపణలు చేసింది. స్టాక్ మానిప్యులేషన్, అకౌంట్లలో అవకతవకలు ఉన్నాయంటూ ఆరోపించింది. వాటిని అదానీ గ్రూప్ తిరస్కరించింది. ఈ క్రమంలో అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్ భారీగా పడిపోయాయి. దీంతో అదానీ వ్యక్తిగత సంపద ఏకంగా 60 శాతం మేర పడిపోయింది. 69 బిలియన్ డాలర్ల స్థాయికి దిగజారింది. దీంతో దేశంతో పాటు ప్రపంచ సంపన్నుల జాబితాలో తన ర్యాంకును పోగొట్టుకున్నారు. తాజాగా సుప్రీం కోర్టు.. తమ తీర్పులో విదేశీ సంస్థల ఆరోపణలు, మీడియాలో వచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకోలేమని కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో అదానీ గ్రూప్ కంపెనీలకు మరింత బలం చేకూరినట్లయింది. నెల రోజుల్లో అదానీ హిండెన్ బర్గ్ కేసుపై విచారణ పూర్తి చేయాలని సెబీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పెరిగాయి




Tags:    

Similar News