Airindia First Look : ఎయిరిండియాకు కొత్త రూపం.. ఫ్లైట్ల న్యూ లుక్ అదుర్స్..

Byline :  Kiran
Update: 2023-10-07 12:12 GMT

ఎయిరిండియాను టేకోవర్ చేసుకున్న టాటా సన్స్ ఎయిర్ లైన్స్ను గాడిలో పెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కంపెనీ లోగో, ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్లో మార్పు చేసింది. నయా లుక్తో ఉన్న ఫ్లైట్ ఫస్ట్ లుక్ ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్గా మారింది.ఫ్రాన్స్‌లోని టౌలోసీ వర్క్‌షాప్‌లో న్యూ లోగో, డిజైన్‌తో సరికొత్తగా రూపుదిద్దుకున్న ఏ350 ఫ్లైట్ ఫోటోలను ఎయిరిండియా తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. త్వరలోనే ఈ A 350 విమానాలు ఇండియాకు రానున్నాయి.




 


‘ద విస్టా’గా పేరుతో ఏర్పాటు చేసిన కొత్త లోగోలో బంగారం వన్నెతో మహారాజా మస్కట్ విండో ఫ్రేమ్ చేర్చారు. అపరిమిత అవకాశాలు, ప్రగతి శీలత, భవిష్యత్‌పై తమ విమానయాన సంస్థకు గల విశ్వాసానికి, ధైర్యానికి సంకేతంగా ఈ లోగో డిజైన్ చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఎయిరిండియా లోగోలో ఫాంట్ కూడా మార్చారు. సొంతంగా ‘ఎయిర్ ఇండియా శాన్స్’ ఫాంట్ డిజైన్ చేశారు. ఎరుపు, ఊదా, గోల్డ్ కలర్లలో ఫ్లైట్ డిజైన్‌ మార్చేశారు. త్వరలోనే పాత విమానాలన్నీ కొత్త డిజైన్లోకి మారుతాయని ఎయిరిండియా ప్రకటించింది. డిసెంబర్ నుంచి కొత్త లోగోతో ఉన్న కొన్ని విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వచ్చే రెండేండ్లలో తమ విమానాలన్నీ కొత్త లోగోలోకి మారతాయని ఎయిరిండియా స్పష్టం చేసింది.




Tags:    

Similar News