Railway Jobs : నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో 9000 ఉద్యోగాలు

Update: 2024-02-02 04:00 GMT

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. త్వరలోనే 9000 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పట్నా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి తాజాగా షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. ఫిబ్రవరిలోనే 9000 ఉద్యోగాల భర్తీకి పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి మార్చి, ఏప్రిల్‌లో ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయని, అక్టోబర్, డిసెంబర్ నెలలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఉంటాయని తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎంపికైన అభ్యర్థుల వివరాలను ప్రకటించనున్నట్లు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది.

5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి బాజ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్లలో వివరాలు చెక్ చేసుకోవచ్చు. ఈ అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు ఫిబ్రవరి 19వ తేది వరకూ ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 19వ తేదితో అప్లై చేయడానికి గడువు ముగుస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనునేవారు కచ్చితంగా ఐటీఐ పూర్తి చేసుండాలి. లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్స్ విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా చేసి ఉండాలి.

ఏఐసీటీఈ ద్వారా గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఇంజినీరింగ్‌ను పూర్తి చేసినవారు కూడా అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చచు. ఎంపికైన అభ్యర్థులకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకూ జీతం ఇవ్వనున్నారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మహిళలకు రూ.250లు, మిగిలినవారికి రూ.500 వరకూ దరఖాస్తు ఫీజు ఉంటుంది. అహ్మదాబాద్‌, అజ్మీర్‌, అలహాబాద్‌, బెంగళూరు, భోపాల్‌, భువనేశ్వర్‌, బిలాస్‌పూర్‌, ఛండీగడ్‌, చెన్నై, గోరఖ్‌పూర్‌, గౌహతి, జమ్మూశ్రీనగన్‌, కోల్‌కతా, మాల్దా, ముంబై, ముజఫర్‌పూర్‌, పాట్నా, రాంచీ, సికింద్రాబాద్‌, సిలిగురి, తిరువనంతపురం ప్రాంతాల్లో ఈ పోస్టుల భర్తీని రైల్వే చేపట్టనుంది.

Tags:    

Similar News