భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

Update: 2023-07-19 16:31 GMT

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మహారాష్ట్రలోనూ చాలా ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. మరో రెండు మూడు రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

కుండపోత వర్షాల ప్రభావం ముంబైలో పలు రైలు సర్వీసులపై పడింది. దీంతో సీఎం ఏక్ నాథ్ షిండే ఉద్యోగులు క్షేమంగా ఇంటికి చేరుకునేందుకు ముంబై, పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను ముందుగానే మూసివేయాలని ఆదేశించారు. తాజాగా మహా సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో గురువారం స్కూళ్లకు సెలవు ప్రకటించింది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా స్థానిక అధికారులు సెలవు విషయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

ముంబైతో పాటు రాయ్ ఘడ్, పాల్ఘర్ జిల్లాల్లోనూ భారీ వానలు పడుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ ఆ రెండు జిల్లాకు సైతం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబై, రాయ్ ఘడ్, పాల్ఘర్ లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.



Tags:    

Similar News