హైకోర్టు తీర్పు: సహజీవనం చేయొచ్చు.. కానీ!

Update: 2023-08-02 15:45 GMT

ఈ మధ్యకాలంలో అనైతిక కార్యక్రమాలు ఎక్కువైపోయాయి. ప్రేమ, సహజీవనం పేరుతో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతున్నాయి. దీనిపై అలహాబాద్ హైకోర్ట్ కీలక తీర్పునిచ్చింది. సహజీవనాన్ని వివాహపరమైన సంబంధంగా పరిగణించేందుకు కొన్ని పరిమితులు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. 18 ఏళ్లలోపు వారు సహజీవనం చేయడం చట్టవిరుద్ధమని, అనైతికమని కోర్టు వెల్లడించింది. ఓ కేసు విచారణ సందర్భంగా.. 18 ఏళ్లలోపు అబ్బాయి.. తన కంటే పెద్దదైన అమ్మాయితో సహజీవనం చేయడం చట్టపరమైనది కాదని స్పష్టం చేసింది.

18 ఏళ్లలోపు వ్యక్తి, తనకంటే పెద్దమ్మాయితో సహజీవనం చేస్తే.. అమ్మాయితో రక్షణ ఇవ్వలేకపోవడమే కాకుండా.. తన రక్షణ ప్రశ్నార్థకం అవుతుందని హైకోర్ట్ జస్టిస్ వివేక్ కుమార్ బిర్లా, జస్టిస్ రాజేంద్ర కుమార్ లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. ఇద్దరు వ్యక్తులకు ఇష్టపూర్వకంగా జీవించే హక్కు ఉందని, కానీ వాళ్లు మేజరై ఉండాలని ధర్మాసనం తెలిపింది. ఈమేరకు దాఖలైన పిటిషన్ ను కొట్టేసింది. కాగా, కొన్నిరోజుల క్రితం ఉత్తరప్రదేశ్ కు చెందిన 19 ఏళ్ల అమ్మాయి, 17 ఏళ్ల అబ్బాయి ఇంటినుంచి పారిపోయి ప్రయాగ్ రాజ్ లో సహజీవనం చేశారు. ఈ క్రమంలో అమ్మాయి తరుపు కుటుంబసభ్యులు పోలీస్ కేసు పెట్టారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని కోర్టులో హాజరుపరిచారు.


Tags:    

Similar News