Amit Shah : అమిత్ షాకు తప్పిన పెను ప్రమాదం

Byline :  Bharath
Update: 2023-11-08 05:24 GMT

కేంద్ర మంత్రి అమిత్ షాకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ఈ ప్రమాదం జరిగింది. నాగౌర్ లోని రోడ్ షోలో నిర్వహిస్తుండగా.. ప్రచార రథం కరెంట్ వైర్లకు తాకింది. ఆ గ్రామంలో రెండు వైపులా దుకాణాలు, ఇళ్లు ఉండగా.. ప్రచార రథం వెళ్తున్న టైంలో కరెంట్ స్తంభానికి రథం తాకగా.. వైర్లు తెగిపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనతో అప్రమత్తమైన బీజేపీ నేతలు అమిత్ షా వాహనం వెనుక వస్తున్న వాహనాలను నిలిపివేశారు. ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ స్పందించారు. దీనిపై దర్యాప్తు చేయాలని మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు.




Tags:    

Similar News