రేపు బీజేపీ భారీ సభ.. ఖమ్మంలో వేదికగా ఎన్నికల శంఖారావం..

Update: 2023-08-26 02:11 GMT

కేంద్ర మంత్రి అమిత్ షా ఆదివారం ఖమ్మం జిల్లాకు రానున్నారు. అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో 3 -4 నెలల సమయం మాత్రమే ఉండటంతో యాక్టివ్ మోడ్లోకి వచ్చిన బీజేపీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసింది. కేడర్లో జోష్ నింపేలా అమిత్ షా సభ ఉంటుందని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారు.




 


టార్గెట్ బీఆర్ఎస్

ఖమ్మం సభలో అమిత్ షా ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధికార బీఆర్ఎస్ టార్గెట్ గా ఆయన స్పీచ్ ఉంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు సంధించడం ద్వారా అమిత్ షా ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని పార్టీ నేతలు అంటున్నారు. రాష్ట్ర నాయకత్వంతో పాటు కేడర్ ను సన్నద్దం చేసేందుకు ఈ సభ ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

ఎలక్షన్ మోడ్

బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందంటూ ప్రచారం సాగుతున్న నేపథ్యంలో దాన్ని తిప్పికొట్టేలా అమిత్ షా బీఆర్ఎస్ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసే అవకాశముంది. కేసీఆర్ సర్కారు పోకడలు, విధానాలు, అవినీతి, కుంభకోణాలను ఆయన ఎండగడతారని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు. గత నెల 8న వరంగల్‌లో ప్రధాని మోడీ బహిరంగ సభ జరిగింది. దాదాపు 50 రోజుల తర్వాత జరగనున్న ఖమ్మం సభ ద్వారా అమిత్‌ షా ఎన్నికల బీజేపీని ఎలక్షన్ మోడ్లోకి తీసుకెళ్తారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.

అమిత్‌ షా షెడ్యూల్‌

అమిత్ షా ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో భద్రాచలం చేరుకుంటారు. భద్రాద్రి ఆలయంలో సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం హెలికాప్టర్‌లో భద్రాచలం నుంచి ఖమ్మంకు చేరుకుని బహిరంగసభలో పాల్గొంటారు. సభ ముగిసిన తర్వాత బీజేపీ రాష్ట్ర కోర్‌ కమిటీ, పార్టీ కీలక నేతలతో సమావేశమవుతారు. సాయంత్రం 5.45 గంటలకు హెలికాప్టర్‌లో ఖమ్మం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు వెళ్తారు.




Tags:    

Similar News