నేపాల్లో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. మధ్యాహ్నం 2.51 గంటల సమయంలో వచ్చిన భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకటించింది. ఈ భారీ భూకంపం కారణంగా జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఇంకా ఎలాంటి వివరాలు అందలేదు.
ఇదిలా ఉంటే నేపాల్లో భూకంప ప్రభావం భారత్లోనూ కనిపించింది. ఢిల్లీ ఎన్సీఆర్, నోయిడాతో పాటు ఉత్తరాఖండ్లోనూ భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ప్రకంపనల ధాటికి జనం భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉత్తర్ ప్రదేశ్ లోనూ భూమి కంపించడంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఆఫీసుల్లో పనిచేస్తున్న వారంతా బిల్డింగుల నుంచి బయటకు వచ్చేశారు.