ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా
చెస్ ప్రపంచంలో ప్రస్తుతం చాలా గట్టిగా వినిపిస్తున్న పేరు ప్రజ్ఞానంద. రీసెంట్ గా జరిగిన చెస్ వరల్డ్ కప్ ఫైనల్ లో రన్నరప్ గా నిలిచినప్పటికీ ఛాంపియన్ కార్ల్ సన్ ను ముప్పుతిప్పలు పెట్టించాడు ప్రజ్ఞానంద. దీంతో ఇతని పేరు ప్రపంచమంతా మారుమోగిపోతోంది. తాజాగా మహీంద్రా ఓనర్ ఆనంద్ మహీంద్రా అతని తల్లిదండ్రులకు మంచి గిఫ్ట్ ను అనౌన్స్ చేశారు.
రన్నరప్ గా నిలిచిన ప్రజ్ఞానందను అభినందిస్తూ ఆనంద్ మహీంద్రా అభినందిస్తూ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. దీనికి స్పందించిన నెటిజన్లు ప్రజ్ఞానందకు థార్ కార్ ను బహుమతిగా ఇవ్వాలని కోరారు. ట్వీట్లకు స్పందించిన ఆనంద్ ఈరోజు మరో పోస్ట్ పెట్టారు. ప్రజ్ఞానందకు థార్ ఇవ్వాలని చాలామంది అడిగారు. అయితే నా దగ్గర మరో ఐడియా ఉంది. తల్లిదండ్రులకు తమ పిల్లలకు చెస్ ఆటను పరిచయం చేయాలని...వారికి ఆ గేమ్ మీద ఆసక్తి పెంచేలా చేయాలని నేను కోరుకుంటున్నా. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలా ఫ్యూచరో...చెస్ కూడా భావితరాల భవిస్యత్తుకు మంచి పెట్టుబడి అని భావిస్తున్నా అన్నారు ఆనంద్. అందుకే ప్రజ్ఞానంద తల్లిదండ్రులు నాగలక్ష్మి, రమేశ్ బాబుకు ఎక్స్ యేవీ 400ఈవీని బహుమతి ఇవ్వాలనుకుంటున్నా. తమ కొడుకు ఇంతలా తీర్చిదిద్దినందుకు వారు ఈ కానుకకు పూర్తి అర్హులు అని ఆనంద్ పోస్ట్ లో రాసుకొచ్చారు.
దీనికి మహీంద్రా అండ్ మహీంద్రా సీఈఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ జెజురికర్ ను ఆనంద్ మహీంద్రా ట్యాగ్ చేశారు. దీనికి రాజేశ్ కు వెంటనే బదులిచ్చారు. తక్షణమే ఎక్స్ యూవీ 400 ప్రత్యేక ఎడిషన్ ఈవీని ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు డెలవరీ చేస్తామని చెప్పారు. దాంతో పాటూ ప్రజ్ఞానందకు, అతని తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. ఆనంద్ మహీంద్రా పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. మీ ఆలోచనా ధోణి నిజంగా స్ఫూర్తిదాయకం అంటూ నెటిజన్లు పొగుడుతున్నారు.