పిచ్చి పట్టిందో, లేకపోతే మరే ఉద్దేశంతోనే ఓ వ్యక్తి దక్షిణ మధ్య రైల్వే అధికారులను ఠారెత్తించాడు. త్వరలో హైదరాబాద్ – ఢిల్లీ మార్గంలో ఒడిశా రైలు ప్రమాదం జరుగుతుదని హెచ్చరిస్తూ లేఖ రాశాడు. ‘‘త్వరలో ఘోర రైలు ప్రమాదం జరుగుతుంది. వారం రోజుల్లో ఒడిశా తరహా యాక్సిడెంట్. హైదరాబాద్ - ఢిల్లీ మార్గంలోనే ఇది జరుగుతుంది’’ అని లేఖలో బెదిరించాడు. అతని వివరాలేవీ ఉత్తరంలో లేవని తెలుస్తోంది. అధికారులు ఈ ఉత్తరంపై ఆరా తీస్తున్నారు. మూడు రోజుల కిందట రైల్వే అధికారులు తమకు ఈ లేఖ గురించి చెప్పారని పోలీసులు తెలిపారు. ఇక ఆకతాయి రాసిన లేఖ కావొచ్చని భావిస్తున్నారు. ఒడిశాలోని బలాసోర్‌లో గత నెల 2న ఒక గూడ్సు రైలు, రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లు ఢీకొనడంతో 294 మంది చనిపోవడం తెలిసిందే.