ఉదయనిధి స్టాలిన్ మరో కాంట్రవర్సీ పోస్ట్..ఫోటో వైరల్

By :  Aruna
Update: 2023-09-11 10:32 GMT

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన కొడుకు ఉదయనిధి స్టాలిన్ సినీ కెరీర్ను పక్కనబెట్టి రాజకీయాల్లో యమ జోరుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తండ్రి కేబినెట్లో మంత్రిగా ఉన్న స్టాలిన్ తన పొలిటికల్ మార్క్‎ను చూపిస్తున్నారు. ఇప్పటికే డీఎంకేపై హిందూ వ్యతిరేక పార్టీ అనే ముద్ర ఉంది. ఈ క్రమంలోనే తమిళనాడులో జరిగిన సనాతన నిర్మూలన సదస్సులో ఉదయనిధి స్టాలిన్ వివాదస్పద కామెంట్స్ చేశారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం కాదు పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. అంతే కాదు సనాతన ధర్మం డెంగీ, మలేరియా లాంటిదని పోల్చారు. సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధమని చెప్పారు.

ఉదయనిధి చేసిన ఈ కామెంట్స్ దేశవ్యాప్తంగా మత, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ సహా మత పెద్దలు, అర్చకులు డీఎంకేపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇంకా ఈ ఇష్యూ జరుగుతున్నా ఉదయనిధి మాత్రం తగ్గేదేలే అంటూ తన ఫ్లోలో తాను వెళ్లిపోతున్నారు. తాజాగా ఉదయనిధి తన ట్విటర్ అకౌంట్లో ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. దోమలను నివారించేందుకు ఇంట్లో వాడే మస్కిటో కాయిల్ ఫోటోను ఉదయనిధి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. అయితే ఈ ఫోటోకు ఎటువంటి క్యాప్ష‌న్‏ను జోడించలేదు. అయితే ఈ ఫొటో ‘సనాతన ధర్మాన్ని ఉద్దేశించి చేసినట్లు తెలుస్తోంది. స్టాలిన్ చేసిన డెంగీ, మలేరియా కామెంట్లను గుర్తుచేస్తోంది. ఈ మస్కిటో కాయిలో ఫొటోపై నెటిజెన్లు ఒక్కోలా స్పందిస్తున్నారు. విమర్శలను ఎలా తీసుకోవాలో, వాటికి ఎలా కౌంటర్ ఇవ్వాలో ఉద‌య‌నిధి స్టాలిన్‌కు బాగా తెలుసంటూ కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News