vishal krishna reddy: తమిళనాట మరో కొత్త పార్టీ.. త్వరలోనే ప్రకటన

Byline :  Veerendra Prasad
Update: 2024-02-06 09:08 GMT

తమిళ హీరోలు సినీ రంగంలోనే కాక రాజకీయ రంగంలోనూ తమ సత్తా చాటాలనుకుంటున్నారు. ఇప్పటికే ప్రముఖ స్టార్ హీరోలంతా కొత్త పార్టీలు పెట్టి, పార్టీ పేరును ప్రకటిస్తున్నారు. ఇటీవలే దళపతి విజయ్ (Thalapathy Vijay) ‘తమిళ వెట్రి కళగం’ పేరుతో ఓ పార్టీ రాజకీయాల్లోకి వచ్చాడు. విజయ్‌ బాటలోనే తాజాగా మరో హీరో తమిళనాడు రాజకీయాల్లోకి (Tamil Nadu Politics)వస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నటుడు విశాల్ పొలిటికల్ ఎంట్రీ(Political Entry)కి సిద్ధమయ్యారు. కొత్త పార్టీకి గ్రౌండ్ వర్క్ కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. ఆ రాష్ట్రంలో 2026 ఎన్నికలే లక్ష్యంగా బరిలోకి దిగబోతున్నట్లు తెలిసింది. కొత్త పార్టీని త్వరలోనే అనౌన్స్ చేసి రేపు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓ పార్టీకి మద్ధతివ్వబోతున్నట్లు సమాచారం.

కాగా విశాల్‌కు మొదటి నుంచి రాజకీయాలంటే ఆసక్తి. గత కొన్నాళ్లుగా ఆయన పేరు సినిమాల విషయంలోనే కాక రాజకీయేతర ఎన్నికల్లో బాగా వినిపించింది. కోలీవుడ్ ఇండస్ట్రీ(Kollywood Industry)కి చెందిన నడిగర్ సంఘం, నిర్మాతల మండలి ఎన్నికల్లో విజయం సాధించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు విశాల్ . వీటి కేంద్రంగా కొన్ని వివాదాలు తలెత్తినా ఓ వర్గం నుంచి ఆదరణ పొందారు. ఇక జయలలిత మరణం తర్వాత ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. జయలలిత సిట్టింగ్ స్థానమైన ఆర్.కే నగర్ నుంచి నామినేషన్ వేశారు.అయితే, కొన్ని కారణాల రీత్యా ఆ నామినేషన్‌ తిరస్కరణకు గురైంది.

విశాల్‌ ప్రస్తుతం ‘విశాల్‌ పీపుల్స్‌ హెల్త్‌ మూమెంట్‌’(Vishal People's Health Movement) పేరుతో ప్రజలకు సేవ చేస్తున్నారు. చెన్నైలో వరదలు, ఇతర విపత్తు సమయంలో ప్రజలను ఆదుకుంటున్నారు. గతంలో ఓ సారి విశాల్ మీడియా మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమని.. అయితే నా రాజకీయ ప్రవేశం ఎప్పుడన్నది ఇప్పుడే చెప్పలేనని.. సమాజసేవ చేసేందుకే రాజకీయాల్లోకి అడుగు పెడతానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన పొలిటికల్‌ ఎంట్రీ ఖాయంగా తెలుస్తోంది. ఇప్పటివరకు రాజకీయాల్లోకి వచ్చిన సినీ ప్రముఖులను ప్రజలు ఆదరించారు. విశాల్ కు కూడా తమిళనాట మంచి ఆదరణ ఉండడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఢోకా లేదంటున్నారు కొంతమంది అభిమానులు.

Tags:    

Similar News