మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాజేంద్ర పట్నీ కన్నుమూశారు. గత మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ మరణించారు. ఆయన రాజేంద్ర వశీం జిల్లా కరంజా నుంచి 3 సార్లు శాసన సభ్యుడిగా ఎన్నియ్యారు. 2004లో శివసేన నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2014, 2019లో బీజేపీ టికెట్‌పై శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇక రాజేంద్ర పత్రి మృతికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. వివిధ వర్గాల సమస్యలపై రాజేంద్ర గొంతు ఎత్తారని తెలిపారు. బీజేపీ పార్టీ బలోపేతానికి తీవ్రంగా శ్రమించారన్నారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపుతున్నానన్నారు.