బ్రేకింగ్... ఒడిశాలో పట్టాలు తప్పిన మరో రైలు.. వీడియో

Update: 2023-06-05 06:06 GMT




యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన ఒడిశాలోని బాలాసోర్ రైలు దుర్ఘటన జరిగిన 3 రోజులకే అదే రాష్ట్రంలో మరో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటన బార్‌ఘర్ జిల్లాలో నమోదైంది. బారాగఢ్ జిల్లాలో సున్నపురాయిని తీసుకెళ్తున్న గూడ్స్ రైలులోని అనేక భోగీలు పట్టాలు తప్పినట్లు తాజా సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ రైలు బర్గఢ్‌ నుంచి దుంగ్రీ ప్రాంతానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకొంది.



అయితే రైలు పట్టాలు తప్పడంతో.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. 





 

ఇక కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘోర రైలు ప్రమాదం జరిగి మూడు రోజులు గడిచాయి. ఒకవైపు సహాయకచర్యలు కొనసాగుతుండగానే మరోవైపు ట్రాక్ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు 51 గంటల్లో ధ్వంసమైన ట్రాక్ను యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ నిర్మాణం పూర్తి చేశారు. దీంతో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి.




Tags:    

Similar News