సికింద్రాబాద్-అగర్తలా రైల్లో మంటలు.. పరుగులు పెట్టిన ప్రయాణికులు

Update: 2023-06-06 10:24 GMT

ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం.. యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ ఘోర ప్రమాదాన్ని మరవకముందే.. మరో ఘటన ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది. సికింద్రాబాద్ నుంచి అగర్తలా వెళ్తున్న రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బీ-5 బోగీ నుంచి పొగ రావడాన్ని గమనించిన ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

ఒడిశాలోని బ్రహ్మపుర్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు రావడాన్ని గుర్తించారు. భయంతో కోచ్ నుంచి బయటికి పరిగెత్తారు. దాంతో అప్రమత్తమైన అధికారులు.. ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తర్వాత కోచ్ ను పరిశీలించి మంటలను ఆర్పేశారు. దీంతో రైలు 45 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. ఏసీ కోచ్ లో ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు ప్రథమిక నిర్దారణకు వచ్చారు. తర్వాత కోచ్ ను రిపేర్ చేసి 45 నిమిషాల తర్వాత ప్రారంభించారు. అయితే, ఈ ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రయాణికులు కొత్త కోచ్ వేయాలని డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News