ఏపీ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు.. బీజేపీ చీఫ్ పురంధేశ్వరి

Update: 2023-07-16 16:42 GMT

ఏపీలో ఉన్నది ప్రజాప్రభుత్వం కాదని, ప్రజావ్యతిరేక ప్రభుత్వమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురుందేశ్వరి మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం మద్యం, ఇసుక అమ్మకాల్లో భారీ ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఆదివారం విజయవాడలో జరిగిన పార్టీ పదాధికారుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్తా కష్టపడి పనిచేయాలని కోరారు. ఎన్నికలకు ఎంతో సమయం లేదంటూ ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్నారు. ‘‘రాష్ట్ర ఎన్నికలకు ఐదారు నెలలు మాత్రమే గడువు ఉంది. పార్టీని బలోపేతం చేయాలని అధిష్టానం ఆదేశించింది. ఇది ఏ ఒక్కరి వల్లో సాధ్యం కాదు. ప్రతొక్కరూ కష్టపడి బీజేపీ సిద్ధాంతాలకు ప్రజలకు చేరువ చేయాలి. మోదీ ప్రభుత్వ విజయాలను వివరించాలి’’ అని ఆమె కోరారు. పార్టీ కమిటీలను బోలపేతం చేయాలని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.




 


జగన్ ప్రభుతం మద్యం మద్యం డిస్టిలరీలన్నిటిని తన పార్టీ నేతలకు, స్నేహతులకు ఇచ్చారని ఆమె ఆరోపించారు. అధికార పార్టీ నేతలు ఇసుక మాఫియాతో చేతులు కలిపి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, జగన్ ఇంటి దగ్గరే అత్యాచారం జరిగినా బాధితులకు న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు ఉపాధి కరువైందని, పెట్టు ట్టుబడులు రాకపోవడతో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల పెద్ద కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరిపోతున్నాయని ధ్వజమెత్తారు.


 


Tags:    

Similar News