ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ ముగిసింది. దాదాపు గంటా ఇరవై నిమిషాల పాటు ఈ సమావేశం సాగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అంతకుముందు 45 నిమిషాల పాటు అమిత్ షాతో జగన్ సమావేశామయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించినట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్ట్ నిధులపై కూడా అమిత్ షాతో సీఎం జగన్ మాట్లాడారని తెలుస్తోంది.
బీజేపీ అగ్రనేతలతో భేటీ కోసం సీఎం జగన్ బుధవారం ఉదయమే అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లారు. ఆయన వెంట ఎంపీలు విజయసాయి రెడ్డి, మిధున్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి.. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చిదానందరెడ్డి... ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్‌లు ఉన్నారు.