Onion price Hike: సెంచరీ కొట్టిన ఉల్లి.. దిగొచ్చిన ప్రభుత్వం

Byline :  Bharath
Update: 2023-11-04 02:44 GMT

ఉల్లి ధర సెంచరీ కొట్టింది. కొన్ని ప్రాంతాల్లో రూ. 100కు విక్రయిస్తుండగా.. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఉల్లి ధరలు అదుపుచేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ధరల నియంత్రణకు వీలుగా కర్నూలు వ్యవసాయ మార్కెట్లో 10 టన్నుల ఉల్లిని మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేసింది. ఉల్లి కనీస ఎగుమతి ధరను టన్నుకు 800 డాలర్లుగా నిర్ణయించింది. ఈ మేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ శనివారం ఓ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశీయంగా ఉల్లిగడ్డను అందుబాటులో ఉంచడంతో పాటు ధరలు అదుపు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. నో లాస్.. నో ప్రాఫిట్ విధానంలో తొలుత నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని రైతు బజార్లలో కిలో రూ.36కే ప్రజలకు పంపిణీ చేయనుంది. తర్వాత మిగతా జిల్లాలకు పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు.

ఈ ఏడాది ఉల్లి నారు ఆలస్యం కావడం, దిగుబడి వచ్చేందుకు ఇంకొంత సమయం పట్టే అవకాశముండటంతో దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కిలో ఉల్లి ధర రూ. 100 వరకు పలుకుతోంది. ఇ-కామర్స్‌ సంస్థలు, రిటైల్‌ స్టోర్లలో రూ.80 చొప్పున విక్రయిస్తుండగా.. చిన్న వ్యాపారులు కేజీ రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌లోనూ కిలో ఉల్లి రేటు రూ.100కు పైనే పలుకుతోంది. ధరల కట్టడిలో భాగంగా కేంద్రం ఇప్పటి వరకు 1.70 లక్షల మెట్రిక్‌ టన్నుల బఫర్‌ స్టాక్‌ రిలీజ్ చేసింది.

Tags:    

Similar News