అరవింద్ కేజ్రీవాల్కు ఆరోసారి ఈడీ నోటీసులు

By :  Krishna
Update: 2024-02-14 12:16 GMT

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 19న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఈడీ కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేయడం ఇది ఆరోసారి. గతంలో 5సార్లు నోటీసులు జారీ చేయగా.. ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలో ఈడీ కోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ సీఎం విచారణకు సహకరించడం లేదని కోర్టుకు తెలిపింది. ఈడీ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఫిబ్రవరి 17న కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈడీ ఆయనకు ఆరోసారి నోటీసులు జారీ చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈడీ గతేడాది నవంబర్‌ 2న తొలిసారిగా సీఎం కేజ్రీవాల్‌కు నోటీసులు జారీచేసింది. అయితే ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో ఈడీ అధికారులు డిసెంబర్‌ 21న రెండోసారి నోటీసులు పంపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ఉందన్న కారణంతో 10 రోజులపాటు విపాసన మెడిటేషన్‌ క్యాంప్‌నకు వెళ్లారు. ఈ క్రమంలో జనవరి 3న విచారణకు రావాలంటూ ఆప్‌ అధినేతకు మూడోసారి నోటీసులు పంపించింది. అయితే దానికి కూడా సీఎం కేజ్రీవాల్‌ దూరంగా ఉన్నారు. జనవరి 18న 4వ సారి, జనవరి 31న ఐదోసారి నోటీసులు జారీ చేసింది. అయినా కేజ్రీవాల్ విచారణకు హాజరుకాకపోవడంతో ఈడీ కోర్టును ఆశ్రయించింది.


Tags:    

Similar News