అరెస్టు చేసేందుకే ఈడీ విచారణకు పిలుస్తోంది -కేజ్రీవాల్‌

Byline :  Kiran
Update: 2024-01-04 08:00 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. తనను అరెస్ట్ చేసేందుకే ఈడీ అధికారులు విచారణకు పిలుస్తున్నారని ఆరోపించారు. లిక్కర్ పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదన్న ఆయన.. ఈడీ సమన్లు చట్ట విరుద్ధమని అన్నారు. నిజాయితీ తన పెద్ద ఆస్తి అన్న కేజ్రీవాల్.. బీజేపీ తన ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.

లిక్కర్ కేసులో తనను ప్రశ్నించడం బీజేపీ ముఖ్య లక్ష్యంకాదని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. తనను లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేకుండా చూడటమే ఆ పార్టీ లక్ష్యమని అన్నారు. రెండేళ్లుగా లిక్కర్ స్కాం కేసులో విచారణ జరుగుతోందని అయినా దర్యాప్తు సంస్థలు ఇప్పటి వరకు నయాపైసా అవినీతి జరిగినట్లు గుర్తించలేదని చెప్పారు. నిజంగా అవినీతి జరిగి ఉంటే ఆ కోట్ల సొమ్ముంతా గాలిలో కలిసిపోయిందా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

Tags:    

Similar News