Arvind Kejriwal : విశ్వాసం నిరూపించుకున్న కేజ్రీవాల్.. బీజేపీపై ఫైర్

Byline :  Krishna
Update: 2024-02-17 11:18 GMT

ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ విశ్వాసం నిరూపించుకున్నారు. ఈడీ నోటీసులు, ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో సభలో ఆయనే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో బీజేపీపై కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. అందుకే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. బీజేపీ ఈ లోక్ సభ ఎన్నికల్లో గెలిచినా 2029లో మాత్రం ఆప్దే విజయమన్నారు. 2029 వరకు బీజేపీ నుంచి ఈ దేశానికి ఆప్ విముక్తి కల్పిస్తోందని కేజ్రీవాల్ అన్నారు.

తనను జైల్లో పెట్టినంత మాత్రాన ఆప్ ప్రభుత్వం పడిపోదు అని కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ తనను అరెస్ట్ చేయగలదు కానీ తన సిద్ధాంతాలను కాదని వ్యాఖ్యానించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆప్ చేసిన అభివృద్ధి జరిగిందా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24గంటల కరెంట్ లేదని.. కానీ పంజాబ్లో ఆప్ 24గంటల కరెంట్ ఇస్తుందని చెప్పారు. విద్యుత్ వ్యవస్థను పూర్తిగా మార్చివేశామన్నారు. ఢిల్లీ ఆస్పత్రులకు మందులు నిలిపివేశారని.. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. కోపం ఉంటే తనపై తీర్చుకోవాలి కానీ.. ఢిల్లీ ప్రజలపై కాదని చెప్పారు.

Tags:    

Similar News