Facebook Live : ఫేస్బుక్ లైవ్లో దారుణం...శివసేన నేత పై కాల్పులు

Update: 2024-02-09 03:05 GMT

ముంబాయి (Mumbai)లో దారుణం జరిగింది. ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన (Shiv Sena) నేత దారుణ హత్యకు గురయ్యారు. అభిషేక్‌ ఘోసాల్కర్‌ ఫేస్‌బుక్‌ లైవ్‌(facebook live)లో మాట్లాడుతుండగా ఓ దుండగుడు ఒక్కసారిగా ఆయనపై కాల్పులు జరిపాడు. దీంతో ఆయన ఉన్నచోటే కుప్పకూలాడు. కాల్పుల అనంతరం నిందితుడు కూడా తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక సామాజిక కార్యకర్త మౌరిస్‌ నోరాన్హ ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఘటనకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే కాల్పులకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వైరల్ గా మారింది.

దాడి జరిగింది ఇలా..

శివసేన వర్గానికి చెందిన అభిషేక్‌ ఘోసాల్కర్‌ గతంలో కార్పొరేటర్‌గా పనిచేశారు. ఆయన తండ్రి వినోద్‌ పార్టీలో సీనియర్‌ నేతగా ఉన్నారు. స్థానిక ఉద్యమకారుడైన మౌరిస్, అభిషేక్‌ల మధ్య కొంతకాలంగా వ్యక్తిగతవైరం ఉంది. ఈ క్రమంలో ఐసీ కాలనీ అభివృద్ధి పనుల కోసం మాట్లాడుకోవడానికి నోరాన్హ తన ఆఫీస్ కి అభిషేక్‌ను రమ్మనాడు. దీంతో అక్కడికి వెళ్లిన అభిషేక్‌ ఫేస్‌బుక్‌ లైవ్‌లో దాని గురించి చర్చిస్తుండగా నిందితుడు వెంటనే గన్ తీసి కాల్పులు జరిపాడు. పొట్టలో, భుజంలోకి మూడు సార్లు ఫైరింగ్ జరిపాడు. దీంతో వెంటనే బాధితుడు కుప్పకూలాడు. గమనించిన స్థానికులు అభిషేక్‌ను బొరివాలిలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటన అనంతరం మౌరిస్ కూడా తనను తాను కాల్పుకొని చనిపోయాడు. అయితే ఈ కాల్పుల ఘటన అంతా ఫేస్‌బుక్‌ లైవ్‌లో రికార్డు అయింది.

ఈ ఘటనపై సీఎం ఏక్‌నాథ్‌ శిండే (Eknath Shinde) విచారణకు ఆదేశించగా, దీనిపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. మహారాష్ట్రలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేవని మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే విమర్శించారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఎంపీ సంజయ్‌ రౌత్‌ డిమాండ్ చేశారు. అయితే ఇలా కాల్పులు జరగడం ఇది రెండవసారి. గతంలో శివసేన నేతపై పోలీస్‌ ఆఫీస్ లోనే బీజేపీ ఎమ్మెల్యే కాల్పులకు దిగిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News