Budget 2024 25 : మోడీ హయాంలో ప్రజల ఆదాయం 50శాతం పెరిగింది - నిర్మలా సీతారామన్

Byline :  Kiran
Update: 2024-02-01 06:27 GMT

(Budget 2024 25) ప్రపంచ దేశాలు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నా భారత్ మాత్రం వాటన్నింటినీ అధిగమించి అభివృద్ధి పథంలో పయనిస్తోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మోడీ పాలనలో ప్రజల ఆదాయం 50శాతం పెరిగిందని చెప్పారు. బస్తీలు, కిరాయి ఇండ్లలో ఉండేవారి సొంతింటి కల నిజం చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా వచ్చే ఐదేండ్లలో పీఎం ఆవాస్ యోజన కింద 2కోట్ల ఇళ్లు నిర్మించనున్నట్లు చెప్పారు. రూఫ్‌ టాప్‌ సోలార్‌ పాలసీ కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నట్లు నిర్మల ప్రకటించారు. మోడీ హయాంలో జీడీపీ అంటే గవర్నెన్స్, డెవలప్ మెంట్, పెర్మార్మెన్స్ అని కొత్త అర్థం ఇచ్చామని చెప్పారు.

గత పదేళ్లలో 7 ఐఐటీలు, 16 ట్రిపుల్‌ ఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఎయిమ్స్‌లు, 390 యూనివర్సిటీలు ఏర్పాటు చేశామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. స్కిల్‌ ఇండియా మిషన్‌లో భాగంగా కోటి 40లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. ముద్రా యోజన ద్వారా యువతకు రూ.25లక్షల కోట్లు రుణాలుగా ఇచ్చామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. జీఎస్టీతో ట్యాక్స్ పరిధిని పెంచాయన్న ఆమె.. స్టార్టప్ ఇండియా ద్వారా యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేశామని చెప్పారు.

మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించిన ఘనత మోడీ సర్కారు సొంతమని నిర్మలా సీతారామన్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్‌ యోజన ఇళ్లలో 70శాతం మహిళల పేరుపైనే ఇచ్చాం.

4.50 కోట్ల మందికి బీమా సౌకర్యం కల్పించడంతో పాటు 11.8 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించామని స్పష్టం చేశారు. 


Tags:    

Similar News